వచ్చే ఏడాది వేసవి అక్కినేని అభిమానులకు ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే… కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య, యంగ్ సెన్సేషన్ అఖిల్… ఇలా అక్కినేని కుటుంబం నుంచి ముగ్గురు కథానాయకుల చిత్రాలూ సమ్మర్ లోనే సందడి చేయనున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే…. ఈ సంవత్సరం `మన్మథుడు 2`తో పలకరించిన నాగ్…. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా సాల్మన్ డైరెక్షన్ లో ఓ కాప్ స్టోరీ చేయబోతున్నాడు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా వేసవి చివరలో రిలీజ్ కానుంది. ఇక అంతకంటే ముందు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ నటిస్తున్న `లవ్ స్టోరీ` (ప్రచారంలో ఉన్న పేరు) ఏప్రిల్ 2న రిలీజ్ కానుండగా… `బొమ్మరిల్లు` భాస్కర్ డైరెక్షన్ లో అఖిల్ నటిస్తున్న పేరు నిర్ణయించని సినిమా కూడా వేసవిలోనే విడుదల కాబోతోంది. మరి…. వేసవిలో అక్కినేని వారి తండ్రీకొడుకుల సందడి ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























