
ట్యాగ్ · 3 కథనాలు


సునీల్ హీరోగా "వేదాంతం రాఘవయ్య "మూవీ ప్రారంభం

"వేదాంతం రాఘవయ్య " మూవీ లో సత్యదేవ్
పలు మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సత్యదేవ్ "బ్లఫ్ మాస్టర్"మూవీ తో హీరోగా మరారు. సక్సెస్ ఫుల్ "ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సత్యదేవ్ ప్రస్తుతం "గుర్తుందా శీతాకాలం", "గాడ్సే", "స్కైలాబ్ " మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. "రామ్ సేతు" హిందీ మూవీ లో సత్యదేవ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సత్యదేవ్ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

సునీల్ హీరోగా "వేదాంతం రాఘవయ్య "మూవీ ప్రారంభం
కమెడియన్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించిన సునీల్ సక్సెస్ ఫుల్ మూవీ "అందాలరాముడు"మూవీ తో హీరోగా మారారు. సునీల్ హీరో గా రూపొందిన "మర్యాద రామన్న ", "పూల రంగడు ","తడాఖా "మూవీస్ ఘనవిజయం సాధించాయి. సునీల్ హీరోగా రూపొందిన కొన్ని సినిమాలు పరాజయం పొందడం తో సునీల్ తిరిగి కమెడియన్ గా నటిస్తున్నారు. "కలర్ ఫోటో "మూవీ లో నెగటివ్ రోల్ లో నటించి సునీల్ ప్రేక్షలకులను అలరించారు.
సునీల్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా.. టైటిల్ ప్రకటన
టాలీవుడ్ లో కామెడీ కింగ్ బ్రహ్మానందం తరువాత తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు కమెడియన్ కమ్ హీరో సునీల్. గోదావరి యాసలో మాట్లాడుతూ.. ఓ వెరైటీ టోన్ తో తన కామెడీ మార్క్ ను చూపించాడు. అసలు సొంతం సినిమాలో సునీల్ కామెడీ ఆ సినిమాకే పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ తరువాత వచ్చిన నువ్వునాకు నచ్చావ్, నువ్వే నువ్వే, మల్లీశ్వరి, ఎలా చెప్పను, ఇలా చెప్పుకుంటూ పోతే సునీల్ చేసిన మరిచిపోలేని.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాలు ఎన్నో ఉన్నాయి.