
ట్యాగ్ · 3 కథనాలు

హీరో వరుణ్ తేజ్ కు జోడీగా బాలీవుడ్ భామ ?

మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన మెగా ప్రిన్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి స్పీడ్ మీదే ఉన్నాడు. అలా షూటింగ్ ను మొదలు పెట్టాడో లేదో అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇక ఈసినిమా కోసం గతంలోనే ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో కొన్ని నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఫిబ్రవరి 24 న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించింది. సుమారు రెండు వారాలు జరిగిన ఈ షెడ్యూల్ నిన్ననే ముగిసింది. ఈ షెడ్యూల్ లో వరుణ్ తేజ్, ఇంకొందరు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. అక్కడి షెడ్యూల్ పూర్తవడంతో…
హీరో వరుణ్ తేజ్ కు జోడీగా బాలీవుడ్ భామ ?
సూపర్ హిట్ మూవీస్ "F 2", "గద్దలకొండ గణేష్" తరువాత హీరో వరుణ్ తేజ్ఒక స్పోర్ట్స్ డ్రామా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. బ్లూ వాటర్ క్రియేటివ్స్, రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో #VT10 మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో బాక్సర్ గా నటించనున్న వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

షారూఖ్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది - వరుణ్ తేజ్
కంచె, ఫిదా, తొలిప్రేమ, F2, గద్దలకొండ గణేష్ వంటి సూపర్ హిట్ మూవీస్ తో సక్సెస్ ఫుల్ హీరోగా టాలీవుడ్ లో రాణిస్తున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం తాను బాక్సర్ గా నటించే స్పోర్ట్స్ డ్రామా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ మూవీస్ లో నటించడానికి, ఇండియా లో ఉన్న మేజర్ చిత్ర పరిశ్రమల మూవీస్ లో నటించి తన మార్కెట్ ను విస్తరించాలని వరుణ్ ప్లాన్ చేస్తున్నారు.