
ట్యాగ్ · 2 కథనాలు


సీనియర్ డైరెక్టర్ 'శరత్' కన్నుమూత..!

సీనియర్ ద ర్శకుడు శరత్ మృతి పట్ల బాలకృష్ణ తీవ్ర సంతాపం
సుమన్ , భానుప్రియ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "చాదస్తపు మొగుడు " మూవీ తో శరత్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సుమారు 20 సినిమాలకు శరత్ దర్శకత్వం వహించారు. ముఖ్యంగా సుమన్ , బాలకృష్ణ లతో సూపర్ హిట్స్ అందుకున్నారు.హీరో బాలక్రిష్ణతో "వంశానికి ఒక్కడు", "పెద్దన్నయ్య", "సుల్తాన్", "వంశోద్దరకుడు", సుమన్ తో "చాదస్తపు మొగుడు", "పెద్దింటి అల్లుడు", "బావ-బావమరిది","చిన్నల్లుడు" వంటి సినిమాలు శరత్ తెరకెక్కించారు.

సీనియర్ డైరెక్టర్ 'శరత్' కన్నుమూత..!
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇప్పటికే సినీ పరిశ్రమ ఎంతోమంది సినీ ప్రముఖులను కోల్పోయింది. ఇక ఇప్పుడు మరో సీనియర్ డైరెక్టర్ శరత్ నేడు మృతి చెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. రేపు మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.