
ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2


సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున, అమల దంపతులు
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఆయన తన భార్య అమలతో కలిసి శనివారం ఉదయం హైదరాబాద్ జూబిలీహిల్స్‌లోని సీఎం నివాసానికి విచ్చేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు శుభాభినందనలు తెలియజేశారు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నాగార్జున, మహేష్ బాబు
టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా గురువారం (డిసెంబర్ 7, 2023) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నిన్న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎల్‌బీ స్టేడియంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఆయనతో పాటు 11 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు. వీరితోపాటు మరికొందరు…

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. మెగాస్టార్ సహా పలువురు సెలబ్రిటీల శుభాకాంక్షలు
టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఈరోజు (డిసెంబర్ 7, 2023) ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం ఎల్‌బీ స్టేడియంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఆయనతో పాటు 11 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు. వీరితోపాటు…