
ట్యాగ్ · 2 కథనాలు


ప్రేరణ నిచ్చే కథలనే ఎంపిక చేసుకుంటున్నా -తాప్సీ

ప్రేక్షకుల టైమ్ వేస్ట్ చేయకూడదు
ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెరకి పరిచయమైంది తాప్సీ. అయితే ఆతరువాత కూడా తాప్సీ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమవ్వడంతో.. ఇక మేకర్స్ కూడా అలాంటి పాత్రలే ఇవ్వడంతో తెలుగులో ఈ అమ్మడికి అంత సక్సెస్లు రాలేదు. కానీ హిందీలో మాత్రం తన మార్క్ ను చూపించింది. పింక్, బద్లా, తప్పడ్, సాండ్ కీ ఆంఖ్, మిషన్ మంగళ్ ఇలా వరుస విజయాలు సొంతం చేసుకొని అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా లేడి ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ లా మారింది తాప్సీ. ఇప్పటికే విభిన్న కథా చిత్రాలతో బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసి కేవలం పాత్ర ప్రధానమైన సినిమాలను మాత్రమే చేసుకుంటూ వెళుతుంది.

ప్రేరణ నిచ్చే కథలనే ఎంపిక చేసుకుంటున్నా -తాప్సీ
"ఝుమ్మంది నాదం"మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన తాప్సీ పన్ను సూపర్ హిట్ "ఆడుకాలం" మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "చష్మే బద్దూర్ "మూవీ తో బాలీవుడ్ లో తాప్సీ అడుగుపెట్టారు. తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన తాప్సీ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ పై ఫోకస్ పెట్టి బాలీవుడ్లో "పింక్", "బద్లా", "థప్పడ్", "నామ్ షబానా", "సాండ్ కీ ఆంఖ్", "మిషన్ మంగళ్" వంటి స్ఫూర్తిదాయక చిత్రాల్లో నటించి సత్తా చాటారు.