
ట్యాగ్ · 3 కథనాలు


5 సంవత్సరాల "శ్రీమంతుడు "
మహేష్ బాబు ‘శ్రీమంతుడు’కు 4 ఏళ్ళు

8 ఏళ్లు అయినా శ్రీమంతుడు కొత్త రికార్డులు
కొన్ని సినిమాలు రిలీజ్ అయి ఎన్నేళ్లయినా కూడా ప్రేక్షకులు మాత్రం ఎప్పుడూ రిపీట్ గా చూస్తునే ఉంటారు. ఒకప్పుడంటే థియేటర్లు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. యూట్యూబ్ లు, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు వచ్చిన తరువాత ఏ సినిమాను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేయొచ్చు. ఈ నేపథ్యంలోనే రిలీజ్ అయి 8 ఏళ్లు అయిపోతున్నా ఇంకా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది ఒక సినిమా. ఆ సినిమా మరేదో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న శ్రీమంతుడు.

5 సంవత్సరాల "శ్రీమంతుడు "
జి. మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ , మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , శృతి హాసన్ జంటగా ఊరు దత్తత నేపథ్యంలో రూపొందిన యాక్షన్ డ్రామా "శ్రీమంతుడు "మూవీ 2015 సంవత్సరం ఆగస్ట్ 7 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహేష్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ , ఐఫా , సైమా అవార్డ్స్ అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం "శ్రీమంతుడు "మూవీకి హైలైట్ గా నిలిచింది .
మహేష్ బాబు ‘శ్రీమంతుడు’కు 4 ఏళ్ళు
సూపర్ స్టార్ మహేష్ బాబుకి అచ్చొచ్చిన దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. అలాంటి ఈ ఇద్దరి తొలి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘శ్రీమంతుడు’. “శ్రీమంతులు బాగా వెనకబడిన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం” అనే సామాజిక అంశంతో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ మూవీగా నిలచింది. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో... జగపతిబాబు, సుకన్య, రాజేంద్ర ప్రసాద్, రాహుల్ రవీంద్రన్, ఏడిద శ్రీరామ్, తులసి, సితార, ముఖేష్ రిషి, సంపత్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు.