
ట్యాగ్ · 2 కథనాలు


బ్లాక్ బస్టర్ సింహా మూవీ రీ రిలీజ్ డేట్
తెలుగు చిత్రపరిశ్రమలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా స్టార్ హీరోస్.. డైరెక్టర్స్ కెరీర్లో సూపర్ హిట్స్ అందుకున్న సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు మేకర్స్ తీసుకువస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి, వెంకటేశ్, ఎన్టీఆర్, ప్రభాస్ కెరీర్లోని ఆల్ టైమ్ హిట్ చిత్రాలు థియేటర్లలో రీ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.2010 సంవత్సరం లో అత్యధిక వసూళ్లు సాధించిన, బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సింహా మూవీ రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించనుంది.

నటసింహ బాలకృష్ణ ‘సింహా’కు 10 ఏళ్ళు
“చూడు.. ఒకవైపే చూడు.. రెండో వైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు.. మాడిపోతావ్”.. అంటూ డాక్టర్ నరసింహగా నటసింహ నందమూరి బాలకృష్ణ తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించిన చిత్రం ‘సింహా’. ఇందులో బాలయ్య పలికిన ప్రతీ డైలాగ్ అప్పట్లో సంచలనమే. మరీ ముఖ్యంగా.. జనాల జేజేలందుకునేలా బాలయ్యను సరికొత్త కోణంలో ఆవిష్కరించారు చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను. బాలయ్య ద్విపాత్రాభినయం పోషించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో నయనతార, స్నేహా ఉల్లాల్, నమిత నాయికలుగా నటించారు. కె.ఆర్.విజయ, రెహమాన్, సాయికుమార్, ఆదిత్యమీనన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, వేణు మాధవ్, చలపతిరావు, కృష్ణభగవాన్, ఝాన్సీ ముఖ్య పాత్రలు పోషించారు…