
ట్యాగ్ · 3 కథనాలు


మరో ప్రేమకథ సిద్ధం చేస్తున్న శివ నిర్వాణ

మరో పాన్ ఇండియా మూవీలో విజయ్ దేవరకొండ

ఆ ఖుషి లాగే ఈ ఖుషి ఉంటుంది
శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. మజిలీ సినిమా తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న సినిమా.. మహానటి సినిమా తరువాత సమంత-విజయ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమపై మొదటి నుండి మంచి బజ్ క్రియేట్ అయింది. అప్పట్లో కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈసినిమా. మధ్యలో సామ్ విజయ్ వేరే సినిమాలతో బిజీ అవ్వడం.. ఆ తరువాత సామ్ అనారోగ్యానికి గురవ్వడంతో షూటింగ్ పెండింగ్ పడింది. ఈమధ్యే ఈసినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టారు. ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది చిత్రయూనిట్.

మరో ప్రేమకథ సిద్ధం చేస్తున్న శివ నిర్వాణ
ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొంతమంది మాత్రమే తమ మార్క్ ను చూపించి సక్సెస్ అవ్వగలుగుతారు. ఇక అలా వచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నిన్నుకోరి. నాని హీరోగా వచ్చిన ఈసినిమా మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ కావడంతో హిట్ అందుకుంది. ఆ తరువాత నాగచైతన్యతో చేసిన మజిలీ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో నిర్వాణ టాప్ డైరెక్టర్ ప్లేస్ లోకి వెళ్లిపోయాడు. 'నిన్నుకోరి', 'మజిలీ' చిత్రాలలో చక్కటి ప్రేమకథను చూపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

మరో పాన్ ఇండియా మూవీలో విజయ్ దేవరకొండ
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ "లైగర్"లో నటిస్తున్నారు. అనన్య పాండే కథానాయిక. 50 శాతం పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న "లైగర్" మూవీ షూటింగ్ గోవా లో నెల రోజుల పాటు జరగనుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలతో పాటు కొంత టాకీ పార్ట్ చిత్రీకరించడానికి దర్శకుడు పూరి జగన్నాథ్ ప్లాన్ చేశారు. గోవాలో చిత్రీకరణ పూర్తయిన తర్వాత విదేశాల్లో ఒక షెడ్యూల్ చేయనున్నారనీ , విజయ్ దేవరకొండకు, విదేశీ బాక్సర్లకు మధ్య కొన్ని సన్నివేశాలను ఫారిన్ షెడ్యూల్‌లో తెరకెక్కిస్తారని సమాచారం .