
ట్యాగ్ · 2 కథనాలు


భారీ ప్రమోషన్స్ లో "టక్ జగదీష్ "

మరో ప్రేమకథ సిద్ధం చేస్తున్న శివ నిర్వాణ
ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొంతమంది మాత్రమే తమ మార్క్ ను చూపించి సక్సెస్ అవ్వగలుగుతారు. ఇక అలా వచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నిన్నుకోరి. నాని హీరోగా వచ్చిన ఈసినిమా మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ కావడంతో హిట్ అందుకుంది. ఆ తరువాత నాగచైతన్యతో చేసిన మజిలీ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో నిర్వాణ టాప్ డైరెక్టర్ ప్లేస్ లోకి వెళ్లిపోయాడు. 'నిన్నుకోరి', 'మజిలీ' చిత్రాలలో చక్కటి ప్రేమకథను చూపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

భారీ ప్రమోషన్స్ లో "టక్ జగదీష్ "
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని , రీతూ వర్మ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ ఏప్రిల్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. ఐశ్వర్య రాజేష్ మరో కథానాయిక కాగా జగపతి బాబు , నాజర్ , రావు రమేష్ ముఖ్యపాత్రలలోనటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.