
ట్యాగ్ · 102 కథనాలు · పేజీ 6


"శాకుంతలమ్ "గొప్పదనం - గుణ శేఖర్
దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో బాల నటీనటులతో తెరకెక్కిన "రామాయణం "మూవీ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. "చూడాలని ఉంది ", "ఒక్కడు ", "రుద్రమదేవి "వంటి సూపర్ హిట్ మూవీస్ తో దర్శకుడు గుణశేఖర్ ప్రేక్షకులను అలరించారు. గుణశేఖర్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో "హిరణ్య కశ్యప "మూవీ రుపొందాల్సి ఉండగా , గుణశేఖర్ "శాకుంతలమ్ "మూవీ ని అనౌన్స్ చేశారు.
గుణశేఖర్ 'శాకుంతలం'.. 'హిరణ్యకశ్యప' కంటే ముందే
మొదటినుండి గుణశేఖర్ విభన్నమైన సినిమాలు చేస్తూవుండటం చూస్తున్నాం. మనోహరం, ఒక్కడు, రుద్రమదేవి వంటి చిత్రాలే ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం `హిరణ్యకశ్యప`సినిమా పనుల్లో బిజీగా వున్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఓ హాలీవుడ్ సంస్థతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. అయితే, సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి మరింత సమయం పట్టడంతో ఈ గ్యాప్ లో మరో సినిమాను లైన్ లో పెట్టాడు గుణశేఖర్. మరో పాన్-ఇండియా సినిమా ‘శాకుంతలం’ చేయాలని గుణశేఖర్ నిర్ణయించుకున్నారు.