
ట్యాగ్ · 2 కథనాలు

సర్కారు నౌకరి ప్రమోషనల్ సాంగ్ అప్ డేట్
టాలీవుడ్ టాప్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు సర్కారు నౌకరి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుంది. సునీత తనయుడు కావడంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా నుండి రీసెంట్ గానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఈసినిమా కూడా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో మంచి కంటెంట్ తో రాబోతుందని అర్థమవుతుంది.

సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా సర్కార్ నౌకరి మూవీ ప్రారంభం
ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. సింగర్ సునీత, మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సహకారంతో ఆకాష్ హీరోగా మారారు. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్, నూతన నటి భావనా వళపండల్ జంటగా సర్కార్ నౌకరి మూవీ తెరకెక్కుతుంది.