ట్యాగ్ · 2 కథనాలు

"సరిలేరు నీకెవ్వరు" మూవీ రికార్డ్
ద్విపాత్రాభినయంలో మహేష్..?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ప్రధాన పాత్రలో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకొని... రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మహేష్ తిరిగొచ్చిన తర్వాత ఈ సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది ఈ సినిమా.

"సరిలేరు నీకెవ్వరు" మూవీ రికార్డ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మాస్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన "సరిలేరు నీకెవ్వరు" మూవీ కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ ను త్రోసిరాజని రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.