ట్యాగ్ · 2 కథనాలు
టాలీవుడ్ లో సముద్ర ఖని విలన్ గా బిజీ
యాక్టర్ , డైరెక్టర్ గా పలు సూపర్ హిట్ తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సముద్రఖని "శంభో శివ శంభో ", "జండా పై కపిరాజు "మూవీస్ తో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.పలు తమిళ మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , నెగటివ్ రోల్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సముద్రఖని "విచారణై "తమిళ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు.
"క్రాక్ " మూవీ సముద్ర ఖని ఫస్ట్ లుక్
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవి తేజ, శృతి హాసన్ జంటగా యాక్షన్ థ్రిల్లర్ "క్రాక్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నిజ జీవిత సంఘటనలతో రూపొందుతున్న ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని, అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. ఈ మూవీ లో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.