
ట్యాగ్ · 2 కథనాలు

టాలీవుడ్ లో సముద్ర ఖని విలన్ గా బిజీ

టాలీవుడ్ లో బిజీగా నటుడు , దర్శకుడు సముద్ర ఖని
" పార్తాలే పరవశం "(2001)తమిళ మూవీ తో సముద్రఖని నటుడిగా కెరీర్ ప్రారంభించారు. "ఉన్నై చరణదేందేన్ "(2003 ) మూవీ తో సముద్రఖని దర్శకుడిగా మారారు. ఈ మూవీ కి బెస్ట్ స్టోరీ రైటర్ గా సముద్రఖని తమిళ నాడు స్టేట్ అవార్డ్ అందుకున్నారు. పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ లో నటించిన సముద్రఖని పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ ను తెరకెక్కించారు. "విచారణై "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు.
టాలీవుడ్ లో సముద్ర ఖని విలన్ గా బిజీ
యాక్టర్ , డైరెక్టర్ గా పలు సూపర్ హిట్ తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సముద్రఖని "శంభో శివ శంభో ", "జండా పై కపిరాజు "మూవీస్ తో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.పలు తమిళ మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , నెగటివ్ రోల్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సముద్రఖని "విచారణై "తమిళ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు.