ట్యాగ్ · 2 కథనాలు

గాయపడ్డ చరణ్ - షూటింగ్ బ్రేక్
అప్పుడు ఎన్టీఆర్ హీరోయిన్... ఇప్పుడు చరణ్ హీరోయిన్
టైటిల్ చూసి అప్పుడు ఎన్టీఆర్ హీరోయిన్ ఏంటీ... ఇప్పుడు చరణ్ హీరోయిన్ ఏంటి అన్న డౌట్ వచ్చింది కదా... అసలు సంగతేంటంటే...ఆర్ఆర్ఆర్.. ప్రతిఒక్క సినీ ప్రేక్షకుడు ఎంతగానే ఎదురుచూస్తున్న సినిమా. ఇక సినిమాలో ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 70శాతం షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. సెప్టెంబర్ కల్లా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే గత కొద్దికాలంగా జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుండగా...కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ చెప్పారు.

గాయపడ్డ చరణ్ - షూటింగ్ బ్రేక్
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూణె లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. జిమ్ చేస్తున్న సమయంలో కాలు బెణికి చిన్న గాయమైంది. దీంతో చెర్రీని మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో చిత్రీకరణ కూడా మూడు వారాల తర్వాతే కొనసాగించనున్నట్లు చిత్రబృందం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.