
ట్యాగ్ · 2 కథనాలు

అవయవదానం చేస్తున్నాం..!

జెనీలియా , రితేష్ దేశముఖ్ 10 వ వెడ్డింగ్ యానివర్సరీ
సూపర్ హిట్ "తుఝే మేరీ కసమ్ "మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన జెనీలియా "బాయ్స్ "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సక్సెస్ ఫుల్ "సత్యం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన జెనీలియా "సాంబ", "బొమ్మరిల్లు , "ఢీ ", "రెడీ " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు.పలు తెలుగు , హిందీ , తమిళ మూవీస్ లో జెనీలియా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
అవయవదానం చేస్తున్నాం..!
‘వైద్యో నారాయణో హరి’.. అంటే వైద్యుడు దేవుడితో సమానం అని అర్ధం. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై వైద్యులే ముందుండి పోరాటం చేసి ప్రజల ప్రాణాల్ని కాపాడుతన్నారు. వారే కనుక లేకపోయిఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. ఇక నిన్న జాతీయ వైద్యుల దినోత్సవం. ఈ నేపథ్యంలో.. డాక్టర్స్ డే సందర్భంగా జెనీలియా, రితేష్ లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే... తమ అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో జెనీలియా ఒక వీడియోను పోస్ట్ చేశారు.