ట్యాగ్ · 2 కథనాలు

RGV డబల్ ధమాకా
తర్వాత సినిమా హైదరాబాద్ దాదాగిరిపై..!
రోజుకో పోస్ట్ తో.. రోజుకో అప్ డేట్ తో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాకు మరింత క్రేజ్ తీసుకొస్తున్నాడు వర్మ. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతోనే సగం దుమారం రేపాడు. అక్కడితో ఆగకుండా ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్ లు రిలీజ్ చేస్తూ మరిన్ని వివాదాలకు తెరలేపుతున్నాడు. అంతే కాదు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమాకు సీక్వెల్ తీయనున్నట్టు కూడా తెలిపాడు. టీడీపీకి గుడ్ బై చెప్పిన వల్లభనేని వంశీ ఫైర్ అవుతున్న ఇంటర్వ్యూలు చూసిన తర్వాత తనకు ఈ ఐడియా వచ్చిందని..ఈ సీక్వెల్ కు 'రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్' అనే టైటిల్ పెడతానని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

RGV డబల్ ధమాకా
సంచలనాలకు మారుపేరైన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరో సంచలానికి తెర తీశారు. వారం రోజుల గ్యాప్ లో రెండు సినిమాలకు రిలీజ్ డేట్స్ ప్రకటించారు. టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన కమ్మరాజ్యం లో కడప రెడ్లు, బ్యూటిఫుల్ మూవీస్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు మూవీస్ కు రవిశంకర్ సంగీతం అందించారు.