
ట్యాగ్ · 3 కథనాలు

'అఫీషియల్' రామారావు కి ఇద్దరు హీరోయిన్స్
శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. కాస్త లేట్ గా స్టార్ట్ అయినా కూడా ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఇక కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేయగా.. దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇదిలా ఉండగా ఈసినిమాలో మొదటి నుండి హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే ఒకరు కాదు ఇద్దరు హీరోయిన్స్ రవితేజ సరసన నటించనున్నారు. దివ్యాంశ కౌశిక్, తో పాటు పలు…

#RT 68 మూవీ సెట్స్ లో
ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. "ఖిలాడి "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.సూపర్ హిట్ "క్రాక్ "మూవీ తరువాత రవితేజ హీరోగా రూపొందుతున్న "ఖిలాడి "మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నిజాయితీ 'MRO' గా రవితేజ
ఒక సినిమా అయిపోతుండగానే మరో సినిమాను పట్టాలెక్కించేశాడు రవితేజ. రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఖిలాడి సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇక గ్యాప్ లేకుండా తన 68వ సినిమా షూటింగ్ మొదలు పెట్టేశాడు. ప్రస్తుతం చిత్రబృందం రవితేజతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈనెల ఫస్ట్ నుండి షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు చిత్రయూనిట్ తెలపడమే కాకుండా ప్రీ లుక్ ను సైతం రిలీజ్ చేసింది.