ట్యాగ్ · 2 కథనాలు
రవి బాబు షూటింగ్ ఎక్స్ పీరియన్స్
రవిబాబు 'క్రష్' టీజర్ రిలీజ్
టాలీవుడ్ లో ఉన్న క్రియేటివ్ డైరెక్టర్స్ లో రవి బాబు కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చేయకుండా... డిఫరెంట్ గా ట్రై చేస్తుంటాడు. తన మొదటి సినిమా అల్లరి దగ్గర నుండి మొన్న వచ్చిన ఆవిరి సినిమా వరకూ ప్రతి సినిమాలోనూ వైవిధ్యతను చూపించడం రవిబాబు ప్రత్యేకత. తన క్రియేటివిటీనే తనను ప్రేక్షకులకు దగ్గర చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల ‘అదుగో’ అంటూ పంది పిల్లతో తీసిన ప్రయోగాత్మక చిత్రం అంతగా వర్కౌట్ కాలేదు. ‘ఆవిరి’ అంటూ హారర్ థ్రిల్లర్‌ను తెరకెక్కించినా అది కూడా విజయం దక్కించుకోలేక పోయింది.
రవి బాబు షూటింగ్ ఎక్స్ పీరియన్స్
ప్రయోగాత్మక చిత్ర దర్శకుడు రవి బాబు తన స్వంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ పై నూతన తారాగణం తో రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "క్రష్ " మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కు ముందు కొంత షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న "క్రష్ " మూవీ3నెలల లాక్ డౌన్ తరువాత తెలంగాణ ప్రభుత్వం అనుమతి తో షూటింగ్ ప్రారంభమయింది. లాక్ డౌన్ తరువాత షూటింగ్ జరుపుకుంటున్న మొదటి సినిమా "క్రష్ ".