
ట్యాగ్ · 2 కథనాలు

`భీష్మ`తోనూ రష్మిక కొనసాగిస్తుందా?

రష్మిక మీ భర్త కావాలని ఉంది.. అయితే అతడి అనుమతి తీసుకోవాలి..!
కరోనా వల్ల సినిమా సెలెబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక సోషల్ డిస్టెన్స్ అయితే వుంది కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులకు ఎప్పటికప్పుడు దగ్గరగానే వుంటున్నారు. వాళ్ళతో లైవ్ ల ద్వారా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రష్మిక కూడా తన అభిమానులతో మాట్లాడి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అంతే కాదు కాస్త కామెడీ కూడా చేసింది. ఇక సందర్భంగా ఒక అభిమాని ఆ దేవుడు నాకు ఎదురైతే నన్ను నీ భర్తని చేయమని అడుగుతా అని అనగా.. దానికి రష్మిక దయచేసి ముందు ఇతడి అనుమతి తీసుకో అని తన పెంపుడు కుక్క ఫొటో షేర్ చేసింది. అంతేకాదు ఇంకా చాలా ప్రశ్నలు అడగగా వాటికి కూడా సమాధానాలు చెప్పింది.
`భీష్మ`తోనూ రష్మిక కొనసాగిస్తుందా?
సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` అంటూ సందడి చేసిన కన్నడ కస్తూరి రష్మికా మందన్న.. మహాశివరాత్రికి `భీష్మ`తో పలకరించనుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే... ఈ రెండు సినిమాలకూ తనే డబ్బింగ్ చెప్పుకుంది రష్మిక. `సరిలేరు నీకెవ్వరు`లో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం రష్మికకి కలసి వచ్చిన నేపథ్యంలో... `భీష్మ`కి కూడా అది కొనసాగుతుందేమో చూడాలి. రేపు (ఫిబ్రవరి 21) ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.