
ట్యాగ్ · 4 కథనాలు


కొంతకాలం బ్రేక్ అంటున్న 'రానా'

ఒకే బాటలో వెంకటేష్, రానా

ఎమర్జెన్సీ నేపథ్యంలో రానా `విరాటపర్వం`?

రానా-వెంకీ వెబ్ సిరీస్ రానా నాయుడు టీజర్ రిలీజ్
ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తుంది. ఒకప్పటిలా కాకుండా స్టార్ హీరోలు సైతం ఇతర స్టార్ హీరోలతో కలిసి నటించడానికి ఏమాత్రం సందేహించడం లేదు. ఇక ఇప్పటికే పలు సినిమాలు సందడి చేసేశాయి. ఇప్పుడు ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు హీరోలు ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేస్తున్నారు. వారు ఎవరో కాదు దగ్గుబాటి ఫ్యామిలీ నుండి విక్టరీ వెంకటేష్ ఇంకా రానా. వెంకీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. టాలీవుడ్ అగ్రహీరో గా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు రానా.. టాలెంటెడ్ హీరో. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ పై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కొంతకాలం బ్రేక్ అంటున్న 'రానా'
2010లో ‘లీడర్' సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు రానా. ఇక అప్పటినుండి డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మొదటి సినిమా లీడర్ నుండి ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత ఉంటుంది. అందుకే రానా సినిమా అంటే అందరికీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇటీవలే విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా ఎన్నో సార్లు వాయిదా పడుతూ ఫైనల్ గా ఇటీవలే రిలీజ్ అయింది. ఇక కలెక్షన్స్ పరంగా సినిమా నిరాశ పరిచినా పెర్ఫామెన్స్ పరంగా మాత్రం విమర్శకుల ప్రశంసలు కురిపించారు.

ఒకే బాటలో వెంకటేష్, రానా
ఈ వేసవి దగ్గుబాటి అభిమానులకు వెరీ స్పెషల్ కానుంది. ఎందుకంటే.. దగ్గుబాటి బాబాయ్ వెంకటేష్, అబ్బాయ్ రానా.. తమ కొత్త చిత్రాలతో సందడి చేయనున్నారు. `నారప్ప`గా వెంకటేష్ సమ్మర్ లో సందడి చేయనుండగా.. `విరాట పర్వం`తో రానా అదే సీజన్ లో పలకరించనున్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ రెండు చిత్రాలకు నాలుగు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి.

ఎమర్జెన్సీ నేపథ్యంలో రానా `విరాటపర్వం`?
రానా నట ప్రస్థానం రాజకీయ నేపథ్య చిత్రాలతోనే మొదలైంది. `లీడర్` (2010)లో యువ ముఖ్యమంత్రి అర్జున్ ప్రసాద్‌గా పాత్రలో ఒదిగిపోయిన వైనం... రానాకి నటుడిగా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. కట్ చేస్తే... 2017లో విడుదలైన మరో రాజకీయ నేపథ్య చిత్రం `నేనే రాజు నేనే మంత్రి`లోనూ జోగేంద్రగా మెస్మరైజ్ చేశాడు రానా. ఈ రెండు చిత్రాలు సమకాలీన పరిస్థితులను దర్పణం పడుతూ తెరకెక్కిన సినిమాలు కాగా... ఈ సారి పిరియాడిక్ టచ్ ఉన్న పొలిటికల్ మూవీలో నటించబోతున్నాడట రానా.