కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rana Daggubati Latest movie News

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

శోభన్ బాబు బయోపిక్ కు రానా..?

వెండి తెరపై ఇప్పటివరకూ ఎంతో మంది లెజెండ్రీ నటీనటుల బయోపిక్ లు సందడి చేయడం చూశాం. ఇంకా పలువురి బయోపిక్ లు తెరకెక్కుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో బయోపిక్ కూడా తెరపైకి వచ్చింది. ఆ బయోపిక్ ఎవరిదో కాదు. తెలుగు సినీ చరిత్రలో సోగ్గాడుగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబుది. . ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఒకరు ఆయన బయోపిక్ ను చేయాలని భావిస్తున్నాడట. అంతేకాదు ఎప్పటినుండో ఈ కథపై పని చేస్తున్నాడట. ఇంకా శోభన్ బాబు కుటుంబసభ్యుల నుండి అనుమతులు కూడా తీసుకున్నారట.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

జెర్సీ తమిళ్ రైట్స్ రానా చేతికి

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన జెర్సీ సినిమా ఎంత ఎమోషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నానికి ద బెస్ట్ హిట్ దక్కింది జెర్సీతో. కలెక్షన్ల పరంగా కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా. ఇక ఇప్పుడు ఈసినిమా తమిళ్ లో కూాడా రీమేక్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రీమేక్ హక్కులు దక్కించుకుంది ఏ తమిళ్ నిర్మాతో కాదు.. మన టాలీవుడ్ హంక్ రానా. తమిళంలో రానా నిర్మాతగా జెర్సీ రీమేక్ అవుతుందట. ఓ కొత్త డైరక్టర్ తో జెర్సీ తమిళ రీమేక్ ప్లాన్ చేశాడట. ఇందులో తమిళ నటుడు విష్ణు విశాల్‌.. నాని పాత్రను పోషిస్తారని సమాచారం…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

`విరాట ప‌ర్వం` సెకండ్ షెడ్యూల్ అప్‌డేట్‌

రానా, సాయిపల్లవి జంట‌గా న‌టిస్తున్న‌ చిత్రం ‘విరాట పర్వం’. ‘నీది నాది ఒకే కథ’తో ద‌ర్శ‌కుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న వేణు ఊడుగుల… ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీలో… రానా విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నాడ‌ని టాక్. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న‌ ఈ ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్‌కి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్

షేర్