
ట్యాగ్ · 22 కథనాలు · పేజీ 2


'రవితేజ' సినిమాలో 'వేణు'

మారేడుమిల్లి లో "రామారావు ఆన్ డ్యూటీ"
మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన "ఖిలాడి" మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. రవితేజ హీరోగా “రామారావు ఆన్ డ్యూటీ ”, "ధమాకా " మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. రవితేజ హీరోగా "రావణాసుర ", టైగర్ నాగేశ్వర రావు "మూవీస్ అనౌన్స్ అయ్యాయి.బ్లాక్ బస్టర్"క్రాక్ " మూవీ తరువాత హీరో రవితేజ వరుస యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

'రవితేజ' సినిమాలో 'వేణు'
శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వాధికారి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా రీసెంట్ గానే షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఇక ఈసినిమాలో మరో సీనియర్ హీరోను తీసుకుంటున్నట్టు అధికారింగా ప్రకటించారు చిత్రయూనిట్. ఆ హీరో ఎవరో కాదు వేణు తొట్టెంపూడి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వేణు ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నాడు.