
ట్యాగ్ · 2 కథనాలు


బాలీవుడ్ ఎంట్రీ ఊహించలేదు

రామ్ సేతు మూవీ తో బాలీవుడ్ లో సక్సెస్ సాధించిన సత్యదేవ్
బ్లఫ్ మాస్టర్ మూవీ తో టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయిన సత్యదేవ్ హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. విభిన్నమైన సినిమాలు, పాత్రల్లో నటిస్తూ వెర్సటైల్ హీరోగా సత్యదేవ్ తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు . ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో సత్యదేవ్ ప్రతి నాయకుడిగా అద్భుతంగానటించి మెప్పించారు. రీసెంట్‌గా విడుదలైన చిత్రం రామ్ సేతుమూవీ తోసత్యదేవ్ బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టారు.

బాలీవుడ్ ఎంట్రీ ఊహించలేదు
మన టాలీవుడ్ హీరోలు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. పిలిచిమరీ మనవాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. ఈనేపథ్యంలోనే టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ బాలీవుడ్ లో ఆఫర్ రాగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ ప్రధాన పాత్రల్లో అభిషేక్ శర్మ దర్శకత్వంలో ‘రామ సేతు’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో ఓ కీలక పాత్రలో సత్యదేవ్ కు ఛాన్స్ దక్కింది.. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబున్‌దంతియా ఎంటర్‌టైన్‌మెంట్, లైకా ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. దీనిలో భాగంగానే బాలీవుడ్ ఎంట్రీ పై సత్యదేవ్…