
ట్యాగ్ · 22 కథనాలు · పేజీ 2


250 కుటుంబాలకు అండగా 'రకుల్'

రకుల్ ప్రీత్ సింగ్ కొత్త బిజినెస్
టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ నటించిన "దే దే ప్యార్ దే ", "మర్జావాన్" హిందీ మూవీస్ విజయం సాధించడంతో రకుల్ హిందీ మూవీస్ పై ఫోకస్ పెట్టారు. రకుల్ ప్రస్తుతం రెండు హిందీ, రెండు తమిళ చిత్రాలలో నటిస్తున్నారు. ఫిట్ నెస్ బిజినెస్ లో భాగంగా రకుల్ హైదరాబాద్ లో F 45 జిమ్ ను ప్రారంభించారు.

250 కుటుంబాలకు అండగా 'రకుల్'
కరోనా వైరస్ రోజు రోజు కు వ్యాపిస్తున్న వేళ పేద వాళ్లకు అండగా ఎంతోమంది ముందుకొస్తున్నారు. ఇప్పటికే సెలెబ్రిటీస్ నుండి సామాన్య ప్రజల దాకా అందరూ పేద ప్రజలకు సాయం చేస్తున్నారు. ఇక హీరోయిన్ లు కూడా ఒక్కొక్కళ్లు ముందుకొస్తున్నారు. కోట్లకి కోట్లు విరాళాలు ఇవ్వకపోయినా వారికి తోచిన సాయం చేస్తున్నారు. ఇప్పటికే నయన తార 20 లక్షలు విరాళం ఇవ్వగా.. ప్రణీత ఒక్కో కుటుంబానికి కనీసం రూ. 2 వేలు అవసరమని... తమ ప్రణీత ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయలతో 50 కుటుంబాలకు తన వంతుగా సాయం చేస్తున్నాని తెలిపింది.