ట్యాగ్ · 4 కథనాలు
అప్పటి వరకూ నటిస్తూనే ఉంటా..!

తుఫాను బాధితులకు 'తలైవా' సాయం

2020లో రజినీ డబుల్ ధమాకా?
గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రజనీకాంత్ మూవీ
యువ కథానాయకుల కంటే సీనియర్ హీరో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల జోరు పెంచారు. గ్యాప్ లేకుండా సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "దర్బార్ " మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. హీరో అజిత్ వరుస సూపర్ హిట్ మూవీస్ దర్శకుడు శివ కు రజనీకాంత్ తన 168 వ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
అప్పటి వరకూ నటిస్తూనే ఉంటా..!
తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాలపై ఎప్పుడూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తునే ఉంటుంది. ఎప్పటిలాగే ఇప్పుడు అలాంటి వార్తే ఒకటి వినిపిస్తుంది. తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తోన్న వార్తల నేపథ్యంలో ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చాడు. తన గురువు కె.బాలచందర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్ మాట్లాడుతూ... తనకు కొందరు బీజేపీ రంగు వేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో ప్రముఖ తమిళ కవి తిరువళ్లువర్ విషయంలో కూడా భాజాపా ఇలానే చేసిందని, కానీ అది సాధ్యంకాలేదని, తాను కూడా వారి ట్రాప్లో పడనని అన్నారు. దీంతో ఇన్నాళ్ళుగా భాజాపాతో రజనీ కలుస్తారనే వార్తలకు చెక్ పడింది…

తుఫాను బాధితులకు 'తలైవా' సాయం
తమిళ తంబీలపై తనకున్న ప్రేమను మరోసారి చూపించారు సూపర్ స్టార్ రజినీకాంత్. తుఫాను బాధితులకు మరిసారి ఆపన్న హస్తం అందించారు.. అసలుసంగతేంటంటే... తమిళనాడులో తుఫాను కారణంగా చాలా మంది తమ ఇళ్లను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రజినీకాంత్ నాగపట్నానికి చెందిన పది కుటుంబాలకు ఇళ్లను ఇవ్వడం జరిగింది. అంతేకాదు వారిని తమ ఇంటికి పిలిపించి.. ఇంటికి సంబంధించిన పాత్రలను వాళ్లకు ఇచ్చి తమ ఉదార స్వభావాన్ని చూపించారు. దీనితో రజినీపై కూడా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజానికి రజినీ ఇలా చేయడం మొదటిసారి ఏం కాదు. గతంలో కూడా ఇలాంటివి ఎన్నో చేశారు.

2020లో రజినీ డబుల్ ధమాకా?
ఏడాదికో సినిమా లేదా రెండు మూడు సంవత్సరాలకో సినిమాలో నటించే సూపర్ స్టార్ రజినీకాంత్... 2018లో 'కాలా', '2.0' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ ఏడాది ‘పేట’తోనే సరిపెట్టిన సూపర్ స్టార్... 2020లో రెండు సినిమాలతో అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నట్టు కోలీవుడ్ టాక్.