కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Radhe Shyam Movie Latest Updates

ట్యాగ్ · 42 కథనాలు · పేజీ 3

సినిమా వార్తలు

అప్పుడు క్రష్ - ఇప్పుడు అమ్మ

జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ 'రాధే శ్యామ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఇటలీలో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే విడుదల చేసిన పూజా హెగ్డే, ప్రభాస్ ఫస్ట్ లుక్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు మోషన్ పోస్టర్ అయితే అదిరిపోయింది. మరో ప్రేమ కావ్యంలా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది ఆ మోషన్ పోస్టర్ ను చూస్తే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'రాధేశ్యామ్' కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా 'జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్'

బాహుబలి1, బాహుబ‌లి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న "రెబ‌ల్‌స్టార్" ప్ర‌భాస్ త‌న 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ తో బిజీ గా ఉన్నారు చిత్రయూనిట్. ఇటీవలే పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అలానే అక్టోబ‌ర్ 23న‌ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా "బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్" పేరిట మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్

షేర్