
ట్యాగ్ · 2 కథనాలు


రాశీఖన్నా మెస్మరైజింగ్ లుక్

సహజ సౌందర్య "రాశి "
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం “థ్యాంక్ యు”, “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితం అయిన రాశీఖన్నా ఇప్పుడు షూటింగ్స్ లో పాల్గొనడానికి సిద్ధం గా ఉన్నారు.

రాశీఖన్నా మెస్మరైజింగ్ లుక్
కోలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్ రాశీఖన్నా "థ్యాంక్ యు”, "పక్కా కమర్షియల్ "మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో “థ్యాంక్ యు “మూవీ తెరకెక్కుతుంది. హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం "థ్యాంక్ యు” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.