
ట్యాగ్ · 43 కథనాలు · పేజీ 3


"ప్రాజెక్ట్ K "లో అమితాబ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్

'ప్రాజెక్ట్ కే' కోసం 200 రోజులు

ప్రభాస్ "ప్రాజెక్ట్ K " మూవీ ఆడిషన్స్
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైం ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ "ప్రాజెక్ట్ K " తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ క్లాప్ తో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న "ప్రాజెక్ట్ K " మూవీ షూటింగ్ లో అమితాబ్ 5 రోజుల పాటు పాల్గొన్నారు. ప్రభాస్ ప్రస్తుతం "సలార్", "ఆదిపురుష్ " మూవీస్ లో నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా రూపొందిన "రాధేశ్యామ్" మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

"ప్రాజెక్ట్ K "లో అమితాబ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపికా పడుకొనే జంటగా భారీ బడ్జెట్ తో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీ గా "ప్రాజెక్ట్ K" వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీ లో దీపిక పడుకొనే కథానాయిక. బిగ్ బీ అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. "మనం ", "సైరా నరసింహా రెడ్డి "మూవీస్ తరువాత అమితాబ్ "ప్రాజెక్ట్ K "లో నటిస్తున్నారు. ఈ మూవీ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

'ప్రాజెక్ట్ కే' కోసం 200 రోజులు
ప్రభాస్ ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టేశాడు. ఇప్పటికే ప్రభాస్ రాధేశ్యామ్ చివరి దశకు చేరుకోగా మరోవైపు ఆదిపురుష్ కూడా ముమ్మరంగా షూటింగ్ జరుగుతుంది. మరోవైపు సలార్ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’ పేరుతో ఈ మధ్యే ప్రభాస్ సినిమా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా.. ప్రస్తుతం అమితాబ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక తన షూటింగ్ పూర్తయ్యేవరకు అమితాబ్ హైద్రాబాద్ లోనే ఉండనున్నారు.