
ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2


'భీమ్లా నాయక్' రిలీజ్ పై క్లారిటీ.. థియేటర్లలోనే..!

పవన్ ను చూసుకుంటున్న నాగవంశీ

రానా హీరోయిన్ ను కన్ఫామ్ చేసిన 'భీమ్లానాయక్' టీమ్
సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే అందించడమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ రికార్డ్ ను క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమా పై భారీగా అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉందన్న సంగతి తెలిసిందే. ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుండగా కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ ను కూడా షూట్ చేస్తున్నారు.

'భీమ్లా నాయక్' రిలీజ్ పై క్లారిటీ.. థియేటర్లలోనే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ హీరో రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈసినిమా మలయాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన మేకింగ్ వీడియో, ఫస్ట్ గ్లింప్స్ మరియు ఫస్ట్ సింగిల్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు ఫస్ట్ సింగిల్ మిలియన్ వ్యూస్ తో యూ ట్యూబ్ లో ఇంకా టాప్ లో ట్రెండ్ అవుతోంది.

పవన్ ను చూసుకుంటున్న నాగవంశీ
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే కదా. ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాలేకపోవడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా ముందుగా నెగెటివ్ వచ్చింది. ఆ తరువాత జ్వరం, ఒళ్ళు నొప్పులు రావడంతో మరోసారి కోవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. . ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న పవన్ కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. ఇక పవన్ త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.