ట్యాగ్ · 4 కథనాలు
ప్రతి రోజూ పండగే సెకండ్ సింగిల్ రిలీజ్
'ప్రతిరోజూ పండగే' - రాశీ పాడిన ‘యు ఆర్ మై హై’ పాట రిలీజ్
మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ ను, పాటలు, ట్రయిలర్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్, పాటలు అన్నీ బాగుండటంతో చిత్రం కూడా అలరిస్తుందనే నమ్మకం ఏర్పడింది అందరిలో. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి ‘యు ఆర్ మై హై’ అనే మరో పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ పాటను రాశీఖన్నానే పాడటం.

"ప్రతి రోజూ పండగే" మూవీ సింగిల్ "చిన్నతనమే" రిలీజ్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో ఒక కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ప్రతి రోజూ పండగే " మూవీ డిసెంబర్ 20వ తేదీ రిలీజ్ కానుంది. సత్యరాజ్ ఒక కీలక పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
మరో పాట పాడిన రాశీఖన్నా
రాశీఖన్నా... మంచి నటి మాత్రమే కాదు మంచి గాయని కూడా. `జోరు`, `విలన్`(మలయాళం)... ఇలా తను నటించిన సినిమాలకే కాదు... `బాలకృష్ణుడు`, `జవాన్` వంటి తను నటించని సినిమాలకు కూడా పాటలు పాడింది రాశి. కట్ చేస్తే... రెండేళ్ళ తరువాత రాశి మళ్ళీ గాత్రం సవరించుకుంది. తను నాయికగా నటించిన `ప్రతి రోజూ పండగే` కోసం ఓ హుషారైన పాట పాడిందట ఈ టాలెంటెడ్ బ్యూటీ. థమన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాట రాశికి గాయనిగా మరింత గుర్తింపు తీసుకొచ్చే అవకాశం ఉందని టాక్. త్వరలోనే ఈ గీతాన్ని మేకింగ్ వీడియో రూపంలో రిలీజ్ చేస్తారని వినికిడి.
ప్రతి రోజూ పండగే సెకండ్ సింగిల్ రిలీజ్
అల్లు అరవింద్ సమర్పణ లో గీతా ఆర్ట్స్ , యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రతి రోజూ పండగే మూవీ డిసెంబర్ 20వ తేదీ రిలీజ్ కానుంది. ప్రతి రోజూ పండగే మూవీ సెకండ్ సింగిల్ ఓ బావా సాంగ్ ప్రసాద్ ల్యాబ్ లో రిలీజయిన సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా తో సమావేశమయ్యారు. హీరో సాయి తేజ్ మాట్లాడుతూ .. మీడియా నుండి అద్భుతమైన సపోర్ట్ వస్తుందని, థమన్ మంచి సంగీతం అందించారని, ఈ మూవీ అందరినీ అలరిస్తుందని, మనల్ని మనం ప్రశ్నించుకొనే చిత్రమిదనీ అన్నారు.