ట్యాగ్ · 2 కథనాలు

`ప్రతీ రోజు పండగే`కి `సిరివెన్నెల` గీతం
తేజ్ బర్త్ డే ప్రతిరోజూ పండగే నుండి ఫస్ట్ గ్లింప్స్
మారుతి దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేయగా.. ఇక ఈ రోజు తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి కొన్ని సన్నివేశాలను వీడియోగా చేసి ఫస్ట్ గ్లింప్స్ ఆఫ్ ప్రతిరోజూ పండగే పేరుతో విడుదల చేశారు చిత్రయూనిట్.

`ప్రతీ రోజు పండగే`కి `సిరివెన్నెల` గీతం
`చిత్రలహరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత మెగా హీరో సాయితేజ్ నటిస్తున్న సినిమా `ప్రతీ రోజు పండగే`. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో సత్యరాజ్ ఓ ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం... ప్రస్తుతం మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే... థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా కోసం... ప్రముఖ గీత రచయిత `సిరివెన్నెల` సీతారామశాస్త్రి ఓ సందర్భోచిత పాటని రాశారని సమాచారం.