
ట్యాగ్ · 2 కథనాలు

పొలిటికల్ థ్రిల్లర్ 'ప్రస్థానం'కు పదేళ్ళు

టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ పొలిటికల్ మూవీస్
వినోద ప్రధానంగా సాగే చలనచిత్ర రంగంలో ఎక్కువగా ప్రేమ కథలు అలాగే కుటుంబ కథా చిత్రాలు రూపొందుతుంటాయి. అయితే వీటికి భిన్నంగా రాజకీయ నేపథ్యం కలిగిన సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఇవి ప్రేక్షకులను అలరించడంతోపాటు ఆలోచింపజేసేవిగా ఉంటుంటాయి. సామాజిక సమస్యలను ఎత్తిచూపడంలో, అలాగే వాటికి సరైన పరిష్కారాలను చూపడంలో ఇలాంటి తరహా చిత్రాలు ఉపయుక్తంగా ఉంటాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సినీ ప్రియులందరి కోసం తెలుగులో రాజకీయ కథాంశాలతో వచ్చిన బెస్ట్ తెలుగు చిత్రాలను ఒకసారి పరికిద్దాం.
పొలిటికల్ థ్రిల్లర్ 'ప్రస్థానం'కు పదేళ్ళు
తెలుగునాట పలు పొలిటికల్ థ్రిల్లర్స్ సందడి చేసాయి. వాటిలో కొన్ని బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తే.. మరికొన్ని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అలా.. ప్రశంసలు అందుకున్న చిత్రాల్లో 'ప్రస్థానం' ఒకటి. రాజకీయాలు, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు దేవా కట్టా. శర్వానంద్, సాయి కుమార్, సందీప్ కిషన్(తొలి చిత్రం) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పొలిటికల్ డ్రామాలో.. రూబీ పరిహార్, రష్మి గౌతమ్, పవిత్ర లోకేష్, సురేఖా వాణి, మధుసూదనరావు, 'వెన్నెల' కిషోర్, జయప్రకాష్ రెడ్డి, రవిప్రకాష్, మన్నవ బాలయ్య, జీవా, పృధ్వీరాజ్ ముఖ్య పాత్రలు పోషించారు.