ట్యాగ్ · 63 కథనాలు · పేజీ 4
ప్రభాస్ 'ఆదిపురుష్' ఆరంభం
'ఆదిపురుష్' లాంచ్ కు డేట్ ఫిక్స్
'ఆది పురుష్' ముంబై లో గ్రాండ్ లాంచ్
బాలీవుడ్ లో తానాజీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఓం రౌనత్. ఇక ఇప్పుడు ప్రభాస్ తో 'ఆదిపురుష్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుండి అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు ఓం రౌత్. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ఫరైజింగ్ అప్ డేట్ ఇచ్చాడు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వర్క్‌ను ఇటీవలే స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ నేడు ముంబైలో ఈ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియచేసారు చిత్రయూనిట్. ఇక ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెగ్యులర్ షూటింగ్ కూడా నేటి నుండే మొదలుకానుంది.
ప్రభాస్ 'ఆదిపురుష్' ఆరంభం
బాహుబలి1, బాహుబలి2 సినిమాల కోసం దాదాపు ఐదేళ్లు టైమ్ తీసుకున్నాడు ప్రభాస్. ఆ తర్వాత సాహో సినిమాకు దాదాపు రెండేళ్లు.. రాధే శ్యామ్ సినిమా కు కూడా అంతే టైమ్ తీసుకున్నారు.. దీనితో ప్రభాస్ సినిమా రావాలంటే మినిమమ్ రెండేళ్లు టైమ్ తీసుకోవాల్సిందే అన్న అభిప్రాయానికి వచ్చేసారు అందరూ. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తపడుతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వున్నాయి. వాటిలో రాధే శ్యామ్, నాగ్ అశ్విన్ తో సినిమా, ఓం రౌత్ తో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ తో సలార్. అన్నీ ఒకదానికి మించి ఒకటి పెద్ద ప్రాజెక్టులే.
'ఆదిపురుష్' లాంచ్ కు డేట్ ఫిక్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు. రాధేశ్యామ్ అయిపోయిందో లేదో 'కెజిఎఫ్' ఫేమ్ ప్రశాంత్‌నీల్‌తో 'సలార్ సినిమాను ప్రారంభించారు.అప్పుడే ఆదిపురుష్ సినిమాను మొదలుపెట్టేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మోషన్ క్యాప్చర్ వర్క్ స్టార్ట్ చేసినట్టు చెప్పాడు డైరెక్టర్ ఓం రౌత్. ఇక ఈ సినిమా లాంచింగ్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 2వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ముంబైలోని ఓ స్టూడియోలో ప్రారంభించనున్నారని.. అలాగే దాదాపు ఎక్కువ శాతం మూవీ అదే స్టూడియోలో చిత్రీకరించనున్నట్లుగా తెలుస్తోంది.