ట్యాగ్ · 2 కథనాలు

ఫెస్టివల్ సీజన్స్‌లో పూజా హెగ్డే సందడి
అల్లు అర్జున్ కు బాస్ గా పూజ హెగ్డే
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న అల ... వైకుంఠపురములో మూవీ సాంగ్ సామజవరగమన ప్యారిస్ లోని సుందర లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్ టబు, యంగ్ హీరో సుశాంత్, నివేత పేతురాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. థమన్ S సంగీతం అందించారు. ఈ మూవీ లోని రెండు సాంగ్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఫెస్టివల్ సీజన్స్‌లో పూజా హెగ్డే సందడి
ఈ మధ్య స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే పట్టిందల్లా బంగారమే అవుతోంది. `అరవింద సమేత`, `మహర్షి`, `గద్దలకొండ గణేష్`... ఇలా పూజ నాయికగా నటించిన మూడు వరుస చిత్రాలు... బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ మోత మోగించడమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో... పూజ తదుపరి చిత్రాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పూజ... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి జోడీగా `అల వైకుంఠపురములో` చిత్రంలోనూ, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ `జాన్` (వర్కింగ్ టైటిల్)లోనూ, అఖిల్-4లోనూ నాయికగా నటిస్తోంది. అలాగే హిందీ చిత్రం `హౌస్‌ఫుల్ 4`లోనూ ఓ హీరోయిన్‌గా నటించింది.