
ట్యాగ్ · 2 కథనాలు


కల నెరవేరింది - పూజాహెగ్డే

కెరీర్ లో గేమ్ ఛేంజర్ మూవీ "బాహుబలి"- ప్రభాస్
ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా ప్రధాన పాత్రలలో 2 భాగాలుగా రూపొందిన “బాహుబలి ” మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పలు అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ తో దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ను చాటిచెప్పారు. భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందిన “బాహుబలి “హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచి హీరో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు నిచ్చింది. బ్లాక్ బస్టర్ "బాహుబలి "మూవీ తో టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ ప్రారంభం కావడం , ప్రభాస్ నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం.

కల నెరవేరింది - పూజాహెగ్డే
టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే , స్టార్ హీరో విజయ్ జంటగా తెరకెక్కిన “బీస్ట్ ” తమిళ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. “#SSMB28” , “#PSPK 28” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.