
ట్యాగ్ · 2 కథనాలు


25 సంవత్సరాలుపూర్తి చేసుకున్న "పెళ్ళిసందడి "

సెప్టెంబర్ లో "పెళ్ళిసందD"
కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రూపొందిన “పెళ్ళి సందడి “(1996 ) మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకులను అలరించిన “పెళ్ళి సందడి “మూవీ సీక్వెల్ “పెళ్ళిసందD” మూవీ తెరకెక్కుతుంది. ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో ఆర్ కె ఫిల్మ్స్ అసోసియేట్స్ బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో గౌరి రోణంకి దర్శకత్వంలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ , శ్రీలీల జంటగా తెరకెక్కిన “పెళ్ళిసందD” మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

25 సంవత్సరాలుపూర్తి చేసుకున్న "పెళ్ళిసందడి "
శ్రీ రాఘవేంద్ర కార్పొరేషన్ బ్యానర్ పై కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి , దీప్తి భట్నాగర్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "పెళ్ళిసందడి " మూవీ 1996 సంవత్సరం జనవరి 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. 3 నంది అవార్డ్స్ అందుకున్న "పెళ్ళిసందడి " మూవీకి కీరవాణి సంగీతం అందించారు. కీరవాణి స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను అలరించి "పెళ్ళిసందడి " మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.