ట్యాగ్ · 22 కథనాలు · పేజీ 2

రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్?
పవన్ కళ్యాణ్ కి జోడీగా పూజా హెగ్డే?
హిందీనాట ఘనవిజయం సాధించిన `పింక్`... తమిళంలో `నేర్ కొండ పార్ వై` పేరుతో రీమేక్ అయి అక్కడా బ్లాక్ బస్టర్ బాట పట్టింది. అంతేకాదు.. ఇప్పుడా ఎమోషనల్ కోర్ట్ డ్రామా తెలుగులోనూ రీమేక్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ ఫిల్మ్ గా తెరకెక్కనున్న ఈ రీమేక్ కి `లాయర్ సాబ్` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. `దిల్` రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ బాట పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. `పింక్` రీమేక్ ని తన పునరాగమనానికి వేదికగా చేసుకున్న పవన్.. ఆపై టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నాటి కాలంలో సాగే ఈ పిరియాడికల్ ఫిల్మ్ లో పవన్.. రాబిన్ హుడ్ తరహా పాత్రలో దర్శనమిస్తారని తెలిసింది. అంటే.. అవినీతిపరులైన పెద్దల సొమ్మును కొట్టి పేదలకు సాయం చేసే దొంగగా పవర్ స్టార్ కనిపిస్తాడన్నమాట.