ట్యాగ్ · 183 కథనాలు · పేజీ 10
పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ కన్ఫామ్
పవన్ - క్రిష్ సినిమా కోసం గండికోట రాజ్యం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. అటు రాజకీయాలను చూసుకుంటూనే మరోపక్క సినిమాలను కూడా బ్యాలన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. దీనితోపాటు క్రిష్ తో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమా షూటింగ్ కూడా మొదలైంది. అంతేనా సెట్ లో ఉన్నపవన్ కు లుక్ సంబంధించి పలు ఫొటోలు బయటకు వచ్చి వైరల్ అయిన సంగతి కూడా విదితమే.
'వకీల్ సాబ్' సత్యమేవ జయతే సాంగ్ రిలీజ్
మూడేళ్ళ గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో వకీల్ సాబ్ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో చూశాం. వకీల్ సాబ్ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పెంచేసింది చిత్రయూనిట్.
పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ కన్ఫామ్
గతకొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమై పూర్తి రాజకీయాలపైనే ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన సినిమాల్లోకి వస్తున్నట్టు గతకొద్ది కాలంగా పలు వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన పింక్ రీమేక్ చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అవి వార్తలు కాదు నిజమే అని తెలిసిపోయింది. దీనిపై తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా కన్ఫామ్ చేశారు.