
ట్యాగ్ · 43 కథనాలు · పేజీ 3


"హరిహర వీరమల్లు " కు భారీ చార్మినార్ సెట్
‘హరిహర వీరమల్లు’గా పవన్ కళ్యాణ్

కల నెరవేరింది - నిధి అగర్వాల్
నటి కావాలనే అభిలాష ఉన్న నిధి అగర్వాల్ "మున్నా మైకేల్ "మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. "సవ్యసాచి "మూవీ తో టాలీవుడ్ కు నిధి కథానాయికగా పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ తో నిధి గుర్తింపుపొందారు. "భూమి ", "ఈశ్వరన్ " మూవీస్ తో నిధి తమిళ ప్రేక్షకులను అలరించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కథానాయికగా నటిస్తున్న నిధి ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"హరిహర వీరమల్లు " కు భారీ చార్మినార్ సెట్
సీనియర్ నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యం లో క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ "హరిహర వీరమల్లు "తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 17 వ శతాబ్దం లో మొఘల్ , కుతుబ్ షాహి కాలం నాటి చట్టాలను ఎదిరించే వీరుడి నేపథ్యం లో రూపొందుతున్న ఈ మూవీ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నిధి అగర్వాల్ కథానాయికలు. బాలీవుడ్ హీరో అర్జున్ రామ్ పాల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు .
‘హరిహర వీరమల్లు’గా పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు పండుగ ట్రీట్ వచ్చేసింది. శివరాత్రికి పవన్ -క్రిష్ సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ చెప్పిన దగ్గర నుండి ఫ్యాన్స్ దానికోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ నేడు పవన్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తోపాటు టైటిల్ నుకూడా రిలీజ్ చేశారు. ఎప్పటినుండో వార్తలు వస్తున్నట్టే ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ నే ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ‘హరిహర వీరమల్లు’గా పవన్ కళ్యాణ్ నటించనున్నాడు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈసినిమాను తెలుగుతో పాటు పలు బాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్లను బట్టి అర్ధమవుతుంది.