
ట్యాగ్ · 3 కథనాలు


పవన్ కళ్యాణ్ న్యూ మూవీ అప్ డేట్
పవన్ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ 'ఆనంద్ సాయి'

పవన్-హరీష్ మూవీ నుండి పవర్ ప్యాక్డ్ అనౌన్స్ మెంట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే సాగర్ చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా తరువాత వెంటనే ఇప్పటికే షూటింగ్ సగం పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నాడు. ఈసినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈసినిమా తరువాత హరీష్ శంకర్ తో మరో సినిమా చేయనున్నడు పవన్. ఇప్పటికే ఈసినిమా నుండి పలు అప్ డేట్స్ వచ్చాయి. ఇటీవలే పవన్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.

పవన్ కళ్యాణ్ న్యూ మూవీ అప్ డేట్
బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్” చిత్రంతో వెండితెరకు రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “భీమ్లా నాయక్”మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు . ఈ మూవీ తో పాటు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న”హరిహర వీరమల్లు” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీస్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ తమ మూవీస్ అప్ డేట్స్ రిలీజ్ చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
పవన్ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ 'ఆనంద్ సాయి'
ఆర్ట్ డైరెక్టర్ 'ఆనంద్ సాయి' పరిచయం అక్కర్లేని పేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ' చిత్రం మొదలుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఎవడు' చిత్రం వరకు దగ్గర దగ్గరగా వంద చిత్రాలకు పైగా ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసారు. తన కళాదర్శకత్వ నైపుణ్యంతో ఎన్నో ప్రశంసలు, మరెన్నో విజయాలు, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు అందుకున్నారు. గత ఐదు సంవత్సరాలకు పైగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చీఫ్ ఆర్కిటెక్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక కొంత కాలం విరామం తరువాత ఆయన మళ్లీ ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.