
సినిమా వార్తలు
ట్యాగ్ · 22 కథనాలు · పేజీ 2



టాలీవుడ్ కి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ కొంతమంది మాత్రమే నోటెడ్ అవుతారు. కొంతమందికి మాత్రమే లక్ కలిసొస్తుంది. ఇక ఇక్కడ ఒక అప్ కమింగ్ హీరోయిన్ తన క్యూట్ లుక్స్, నవ్వుతో అందరినీ కట్టిపడేసింది. అందుకే ఇంకా తన మొదటి సినిమా కూడా విడుదల కాకముందే ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెనలా దూసుకువస్తుంది ఈ భామ.

రీసెంట్ గా రిలీజైన `హిట్` చిత్రంతో తన ఖాతాలో ఓ హిట్ మూవీని నమోదు చేసుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ స్టార్ `పాగల్` పేరుతో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కి జోడీగా కృతి శెట్టి నటించబోతోందని సమాచారం.