
ట్యాగ్ · 5 కథనాలు


ఎన్టీఆర్ వర్ధంతి.. తారక్, కళ్యాణ్ రామ్ నివాళులు

ఎప్పటికీ మీరే ధ్రువ తార..!
తెలుగు తేజం ఎన్టీఆర్ '25' వ వర్ధంతి

ఎన్టీఆర్.. నటనకు నిర్వచనం నవరసాలకు అలంకారం - బాలకృష్ణ
లెజెండరీ యాక్టర్, నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా.. తనయుడు, నట వారసుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. ఈ మేరకు ఈ ఉదయం సోదరుడు రామకృష్ణతో కలిసి హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌లోని ఆయన సమాధి వద్దకు చేరుకున్న బాలకృష్ణ తండ్రికి పుష్పాంజలి ఘటించారు.

ఎన్టీఆర్ వర్ధంతి.. తారక్, కళ్యాణ్ రామ్ నివాళులు
లెజెండరీ యాక్టర్, నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా.. ఆయన మనవలు, స్టార్ నటులు జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఈ మేరకు ఈ ఉదయం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌లోని ఆయన సమాధి వద్దకు చేరుకున్న నట సోదర ద్వయం తాతకు పుష్పాంజలి ఘటించారు.

ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులు అర్పించిన బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వర్ధంతి నేడు (గురువారం, జనవరి 18, 2024). ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఈ మేరకు ఎన్టీఆర్ కుమారుడు, టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మనవళ్లు జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈ ఉదయమే అక్కడికి చేరుకొని ఘనంగా అంజలి ఘటించారు. అలాగే ఎన్టీఆర్ ఇతర కుటుంబ సభ్యులు రామకృష్ణ, దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని తదితరులు విచ్చేసారు. ఇక వీరితోపాటుగా పలువురు నందమూరి అభిమానులు, టీడీపీ సానుభూతిపరులు…

ఎప్పటికీ మీరే ధ్రువ తార..!
తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసిన వారిలో ఎంతోమంది ఉండగా అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు గురించి. తెలుగు సినీ చరిత్రలో ఆయన సృష్టించిన సంచలనాలు, నెలకొల్పిన రికార్డులు అనేకం. తెలుగు చలన చిత్ర రంగంలోనే కాదు... యావత్ ప్రపంచ చలన చిత్ర రంగంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నెలకొల్పినన్ని రికార్డులు నెలకొల్పటం మరి ఏ ఇతర నటుడికి సాధ్యం కాదు. సాంఘిక, పౌరాణిక ఇలా ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రలో ఆ పాత్ర తన కోసమే పుట్టిందేమో అన్నట్టు ఉంటుంది. సినీ చరిత్రలో ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో. అలాంటి నటుడు ఇంత వరకూ రాలేదు.. ఇకపై కూడా అలాంటి నటుడిని చూడటం అనేది…
తెలుగు తేజం ఎన్టీఆర్ '25' వ వర్ధంతి
యుగపురుషుడు.. తెలుగు వాడు తెలుగు ప్రజలందరికీ అన్న.. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా.. అతను నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అతనే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు. పౌరాణిక చిత్రాల్లో అయితే ఆయన కృష్ణుడి వేషం వేస్తే ఆయనే కృష్ణుడు.. రాముడు వేషం వేస్తే రాముడు.. రావణుడు అయితే రావణుడు.. అర్జునుడు, శివుడు, దుర్యోధనుడు, కర్ణుడు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది.. ఏ పాత్ర అయినా అది ఆయన కోసమే పుట్టినట్టు ఉంటుంది. పలు వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న యుగ…