
ట్యాగ్ · 2 కథనాలు

సైన్స్ ఫిక్షన్ మూవీ లో నిత్యా మీనన్

పెళ్ళి వార్తలపై నిత్యా మీనన్ క్లారిటీ
మలయాళ , తెలుగు , తమిళ , కన్నడ భాషలలో సుమారు 50 సినిమాలలో నటించిన యాక్ట్రెస్ , సింగర్ నిత్యా మీనన్ 8 సంవత్సరాల వయసు లో ఒక ఇంగ్లీష్ మూవీ లో నటించారు. “ఆకాశగోపురం ” తో మలయాళ , “అలామొదలైంది “తో తెలుగు , “నూటరెంబదు “తో తమిళ చిత్ర పరిశ్రమలకు కథానాయికగా పరిచయం అయ్యారు. ” 7 O’ Clock”మూవీ లో సపోర్టింగ్ రోల్ తో నిత్యామీనన్ కన్నడ చిత్ర పరిశ్రమకు , “మిషన్ మంగళ్ ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.తెలుగు , తమిళ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన నిత్యామీనన్ ఒక తమిళ , రెండు మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు.
సైన్స్ ఫిక్షన్ మూవీ లో నిత్యా మీనన్
బ్లాక్ బస్టర్ "అలా మొదలైంది " మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన నిత్యా మీనన్ , ఆ మూవీ లో అద్భుతంగా నటించి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్ అందుకొన్నారు. నిత్యా మీనన్ నటించిన ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, S/O సత్యమూర్తి, రుద్రమ దేవి, జనతా గ్యారేజ్ , గీత గోవిందం మూవీస్ ఘనవిజయం సాధించాయి. తమిళ, మలయాళ భాషల చిత్రాలలో బిజీగా ఉన్న ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యా మీనన్ ఇప్పుడు ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.