
ట్యాగ్ · 2 కథనాలు


నితిన్ కల్ట్ మూవీ రీ రిలీజ్
హీరోల బర్త్ డే ల సందర్భంగా వారు నటించిన కల్ట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ గా మారింది. కేవలం బర్త్ డే అనే కాదు స్పెషల్ డే లు వున్నా కూడా ఇది రిపీట్ అవుతుంది. అందులో భాగంగా జల్సా , ఖుషి ,గబ్బర్ సింగ్,ఒక్కడు, పోకిరి,బిల్లా, వర్షం ఇలా మరి కొన్ని సినిమాలు ఇటీవలే విడుదలయ్యాయి. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 25,26న ఆరెంజ్ రీ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ జాబితాలో మరో సినిమా చేరింది.

నితిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్
సూపర్ హిట్ "జయం " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నితిన్ పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరో నితిన్ కథానాయకుడిగా రూపొందిన "రంగ్ దే!" మూవీ సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో నితిన్ ప్రస్తుతం బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్ "తెలుగు రీమేక్ మూవీ లో నటిస్తున్నారు. "పవర్ పేట " మూవీ కి హీరో నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.