కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Niharika Konidela Wedding News

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

నిహారిక ఎంగేజ్ మెంట్ డేట్ అప్పుడే..?

మెగా కాంపౌండ్ లో కూడా త్వరలో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే నిహారికకు కాబోయే వరుడిని అందరికీ పరిచయం చేశారు. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ పనిచేస్తున్న జొన్నలగడ్డ చైతన్యను ఆమె పెళ్లాడనున్నట్టుగా తెలుస్తోంది. గుంటూరుకు చెందిన ఓ పోలీస్ అధికారి కొడుకు చైతన్య. ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి నిశ్చితార్దానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఆగ‌స్ట్ 13న చైతన్య, నిహారిక ల నిశ్చితార్థం జ‌రిగే అవ‌కాశం ఉందని అంటున్నారు. ఆగ‌స్టులో ఎంగెజ్మెంట్, వ‌చ్చే ఫిబ్ర‌వ‌రిలో పెళ్లి అనుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫైనల్లీ.. కాబోయే భర్తను చూపించిన నిహారిక..!

ఫైనల్లీ.. కాబోయే భర్తను చూపించిన నిహారిక..!మొత్తానికి తనకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసింది మెగా డాటర్ నిహారిక కొణిదల. గతకొద్దికాలంగా నిహారిక పెళ్లి గురించి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. తండ్రి నాగబాబు కూడా త్వరలోనే పెళ్లి చేసేస్తామని చెప్పారు.. తను కూడా ఇంకా తక్కువ టైమే ఉంది అంటూ హింట్స్ ఇస్తూనే ఉంది. ఫైనల్లీ ఇప్పుడు ఆ టైం రానే వచ్చేసింది. నిన్న సోషల్ మీడియాలో మిస్ట్రెస్.. అంటూ.. మొహం కనిపించకుండా క్యూరియాసిటీని పెంచిన నిహారిక... తాజాగా తనకు కాబోయే భర్తను చూపించేసింది. ఈ పోస్ట్ చూసిన తర్వాత సినీ ప్రముఖులతో పాటు మెగా అభిమానులు కూడా నిహారికకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్