
ట్యాగ్ · 2 కథనాలు

నేడే నిశ్చితార్ధం..?

'నిహారిక-చైతన్య' ల నిశ్చితార్థం
ముందు నుండి అనుకున్నట్టుగానే 'నిహారిక-చైతన్య' ల నిశ్చితార్థం నిన్న రాత్రి జరిగింది. నిన్న రాత్రి 8 గంటలకు హైదరబాద్‌లో జరిగింది. ప్రభుత్వ నిబంధనలతో కేవలం కొద్దిమంది ఫ్యామిలీ సభ్యుల సమక్షంలో మాత్రమే ఈ నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగినట్టు తెలుస్తుంది.మెగా కుటుంబ సభ్యులతో పాటు..చైతన్య కుటుంబానికి చెందిన కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు అర్జున్, ఉపాసన, సురేఖ, శ్రీజ, సుస్మిత తదితరులు ఈ మెగా వేడుకలో సందడి చేశారు. నిహారిక బాబాయ్ పవన్ కళ్యాణ్ మాత్రం మిస్ అయ్యారు.
నేడే నిశ్చితార్ధం..?
మెగా డాటర్ నిహారిక పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది కూడా. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్నారు. జొన్నలగడ్డ వెంకట చైతన్య హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఇక ఇరువురు కుటుంబాలకు మంచి అనుబంధం ఉండటంతో ఈ పెళ్లి నిశ్చయించారు. ఇక చైతన్యతో తీసుకున్న ఫొటోలను అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంది నిహారిక. ఈ నేపథ్యంలో ఆగష్ట్ లో ఎంగేజ్ మెంట్ అని.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరగనుందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.