
ట్యాగ్ · 2 కథనాలు


"నేనే నా .. ?! " మూవీ షూటింగ్ పూర్తి

రెజీనా 'నేనే నా' ట్రైలర్ రిలీజ్
‘ఎస్. ఎం. ఎస్’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన రెజీనా ఆ తరువాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. సక్సెస్ రేటు కాస్త తక్కువగా ఉన్నా కూడా రెజీనా కు మాత్రం అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఈమధ్య 'ఎవరు' లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కూడా చేసి మెప్పించింది. ఇక ఇప్పుడు మాత్రం తన ధోరణిని మార్చేసి కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితంకాకుండా పాత్ర ప్రధానమైన సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు మరో థ్రిల్లర్ తో రాబోతుంది.

"నేనే నా .. ?! " మూవీ షూటింగ్ పూర్తి
యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్ పై కార్తీక్ రాజు దర్శకత్వంలో రెజీనా ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్"నేనే నా .. ?! " మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. వెన్నెల కిషోర్ , అక్షర గౌడ ముఖ్య పాత్రలలో నటించారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. రెజీనా ఆర్కియాలజిస్ట్ గా నటించారు. చరిత్రలో మరుగున పడిన ఓ రాణి కథను గురించి అధ్యయనం చేసేందుకు యువ ఆర్కియాలజిస్ట్ రెజీనా సిద్ధమవుతుంది. ఆ అన్వేషణలో ఆమె తెలుసుకున్న నిజాలేమిటి? ఆర్కియాలజిస్ట్ రూపంతోనే ఆ రాణి ఎందుకున్నదనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అని రెజీనా అంటున్నారు.