
ట్యాగ్ · 62 కథనాలు · పేజీ 4


బాలకృష్ణ సినిమాలో నేను లేను..!

ఫోన్ స్క్రిప్ట్స్ తో నవీన్ బిజీ
"లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్", "డి ఫర్ దోపిడీ" , "1నేనొక్కడినే" మూవీస్ లో నటించిన నవీన్ పోలిశెట్టి సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్ "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ " మూవీ తో టాలీవుడ్ కు హీరో గా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో నవీన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. నవీన్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా అనుదీప్ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ "జాతి రత్నాలు " మూవీ లో నటిస్తున్నారు.

బాలకృష్ణ సినిమాలో నేను లేను..!
బాలయ్య తో బోయపాటి సినిమా మొదలైన దగ్గరనుండి ఏదో ఒక వార్త తెరపైకి వస్తూనే ఉంది. ఇప్పటికే బాలయ్య పాత్రపై, హీరోయిన్ పై ఇలా పలు విషయాలపై చిత్రయూనిట్ క్లారిటీ ఇస్తూనే వుంది. ఇదిలా ఉండగా తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హిట్ కొట్టి.. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి కూడా బాలకృష్ణ సినిమాలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. బాలయ్య పాత్రకు అసిస్టెంట్ గా చాలా కీలకమైన రోల్ ఒకటి ఉండగా.. దాని కొరకు ఆయనని తీసుకున్నారని.. రెండు రోజులుగా ఈ వార్త ప్రచారం అవుతుంది. అయితే ఇప్పుడు ఆ వార్తలను ఖండించాడు నవీన్.